అనకాపల్లి నూకాంబిక జాతర

భారత్ న్యూస్ రాజమండ్రి…అనకాపల్లి నూకాంబిక జాతర

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు అనకాపల్లి నూకాంబిక. ప్రతి సంవత్సరం కొత్త అమావాస్య అంటే ఉగాదికి ముందురోజు నుండి నెలరోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా నూకాంబికను భక్తులు కొలుస్తారు.

జాతర ప్రారంభానికి ముందుగా తలలపై గరగలు పెట్టుకుని ఊరంతా తిరుగుతారు. జాతరకు రమ్మని ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తారు. నూకాంబిక జాతర మహోత్సవం చాటింపు వేస్తారు.

ఈ ఉత్సవాలకు అనకాపల్లి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పాల్గొంటారు. జాతర చివరిరోజున నేలపండుగ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించుకుంటారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు.