భారత్ న్యూస్ విశాఖపట్నం..దివ్యాంగ శక్తి’ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ బస్సులో ప్రయాణించారు. సుమారు 11 కిమీ మేర వీరి ప్రయాణం సాగింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు.
