భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌పై చంద్రబాబు సీరియస్… నోటీసులు ఇవ్వాలని పల్లాకు ఆదేశం!
మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పట్టుబడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న ఆయన, పార్టీ కార్యకలాపాలకు తక్షణమే దూరంగా ఉండాలని పుట్టా మహేశ్‌ను ఆదేశించారు.

ఈ విషయంపై స్పందించిన చంద్రబాబు.. పుట్టా మహేశ్ నుంచి వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే, డ్రగ్స్ కేసులో పుట్టా పట్టుబడిన వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కూడా పల్లాను ఆదేశించారు.