చరిత్ర పుటల్లోకి కృష్ణా రైల్వే వంతెన…

భారత్ న్యూస్ అమరావతి..విజయవాడ

చరిత్ర పుటల్లోకి కృష్ణా రైల్వే వంతెన…

బెజవాడ రైలు జంక్షన్ కోసం కృష్ణా నదిపై నిర్మించిన తొలి రైల్వే వంతెన ఇక కనుమరుగు కానుంది. ఇది అత్యంత పురాతన రైల్వే బ్రిడ్జ్, దీనిని కృష్ణా బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఈ చారిత్రాత్మక వంతెన నిర్మాణం 1893 మార్చి 17న మీటర్ గేజ్ రైల్వే కోసం ప్రారంభమైంది.
తర్వాత 1897లో మద్రాస్–బెజవాడ (ప్రస్తుత విజయవాడ) రైల్వే మార్గం అభివృద్ధి కోసం దీనిని మిక్స్‌డ్ గేజ్‌గా మార్చారు. ఈ వంతెన అప్పటి బ్రిటిష్ కాలంలో దక్షిణ భారత రైల్వే రవాణా అభివృద్ధికి ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. నేటికీ ఇది బెజవాడ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. చెన్నై న్యూ ఢిల్లీ గ్రాండ్ ట్రంక్ మార్గంలో 80వ దశకంలో కొత్త బ్రిడ్జిల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం వాటి మీద రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. పాత రైలు వంతెన నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం ప్రస్తుతం గాంధీ కొండగా పిలిచే గుట్టపై చీఫ్ ఇంజనీర్ బంగ్లా ఉండేది. పాతికేళ్ళ క్రితం వరకు అక్కడ పర్యవేక్షక ఇంజనీర్ బంగ్లా ఉండేది. 1989 వరకు ఈ రైలు వంతెన వినియోగంలో ఉంది. 1993లో డి కమిషన్ చేశారు. రైలు బ్రిడ్జి నిర్మాణానికి అత్యంత విలువైన లోహాలను వినియోగించారు. వాటిని దక్కించుకున్న వారు వెస్ట్ నియోజక వర్గానికి చెందిన వ్యక్తి అత్యంత సంపన్నులుగా మారారు. ఒక్కో పిల్లర్ కూల్చడానికి 15రోజుల సమయం పట్టొచ్చు. వంతెన కు రెండు వైపులా ఎత్తైన వాచ్ టవర్లు కూడా ఉంటాయి. పురాతన వారసత్వ కట్టడాలను కాపాడకుండా కూల్చివేయడం పై పలు విమర్శలు వస్తున్నాయి