భారత్ న్యూస్ ఢిల్లీ…వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టివేత
యూపీలోని వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టుబడింది.
రూ.3.53 కోట్ల విలువైన 2 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.
పోలీసులు ఇద్దరు స్మగ్లర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆఫ్రికా నుంచి బంగ్లాదేశ్‌కు.. అక్కడి నుంచి ఇండియాలోకి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తించారు.

మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.