రామాలయంలో చోరీ.. రూ.3.50 లక్షల వెండి ఆభరణాలు అపహరణ..!

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…రామాలయంలో చోరీ.. రూ.3.50 లక్షల వెండి ఆభరణాలు అపహరణ..!!

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి గ్రామంలోని రామాలయంలో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఆలయంలో ఉన్న విలువైన వెండి వస్తువులను అపహరించారు.
ఎస్సై కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం ఆలయాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన ఒక మహిళ గుడి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని ఆలయ అర్చకులకు తెలియజేసింది. పూజారి అక్కడికి వచ్చి పరిశీలించగా ఆలయంలోని కిరీటాలు, వెండి హారతి పళ్లెం సహా మొత్తం కేజీకి పైగా వెండి ఆభరణాలు దొంగిలించబడినట్లు గుర్తించారు. దొంగిలించబడిన వెండి వస్తువుల విలువ సుమారు రూ.3.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.