సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు స్టే

భారత్ న్యూస్ హైదరాబాద్….సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు స్టే

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. టికెట్ రేట్లు పెంచాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. జస్టిస్‌ మహేశ్వరి, జస్టిస్‌ ఏఎస్‌ చంద్రశేఖర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. టికెట్‌ ధరల పెంపుపై ఎప్పుడూ అనుసరిస్తున్న విధానాన్నేపాటించాలని సూచించింది..