…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ పోలీసు శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Mar 13, 2026,
తెలంగాణ పోలీసు శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు పోలీసు శాఖ శుభవార్త చెప్పింది. పోలీస్ విభాగంలో యేటా పెరుగుతున్న ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలోనే భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయనుంది. 2026 ఫిబ్రవరి నెలాకరు నాటికి ఆ శాఖలో దాదాపు 17 వేలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మొత్తం పోస్టులు 95,361 ఉండగా, ప్రస్తుతం 77,369 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దాదాపు 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోలీసు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా, సుదీర్ఘంగా సాగుతుంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే భారీగా నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.
