నేడు ఏపీ కేబినెట్ భేటీ

..భారత్ న్యూస్ అమరావతి..నేడు ఏపీ కేబినెట్ భేటీ

నేడు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది.

సీఆర్డీఏ అథారిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపు, పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు కేటాయింపు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సచివాలయం, హెచ్ఐడీ టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రిక్రల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2316 కోట్లకు పరిపాలనా అనుమతులు, రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.