దేశ రాజధానిలో గ్యాస్ కష్టాలు.. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ రూ.5వేలు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశ రాజధానిలో గ్యాస్ కష్టాలు.. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ రూ.5వేలు!

దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ కొరత తీవ్రమైంది.పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల కారణంగా వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో, 12 ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి.

ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్‌ను రూ.5వేలకు పైగా అమ్ముతున్నారు.

పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాపై కూడా ఆంక్షలు విధించడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ప్రభుత్వం తక్షణమే స్పందించి, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి, గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని వ్యాపారులు కోరుతున్నారు.