ఆయుధాల దిగుమతుల్లో భారత్‌ నం.2ఆయుధాల దిగుమతిలో

భారత్ న్యూస్ రాజమండ్రి…ఆయుధాల దిగుమతుల్లో భారత్‌ నం.2ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలోనే భారత్‌ రెండో స్థానంలో ఉన్నది. 2021-25 మధ్య కాలంలో ప్రపంచంలో మొత్తం ఆయుధ దిగుమతుల్లో భారత్‌ వాటా 8.3 శాతం. మొదటి స్థానంలో ఉక్రెయిన్‌ (9.1 శాతం) ఉన్నది. స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సిప్రి) తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.ఇదివరకు రష్యా నుంచి అధికంగా ఆయుధాలను కొనుగోలు చేసిన భారత్‌.. క్రమంగా ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌, అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలవైపు మళ్లుతున్నదని సిప్రి తెలిపింది. అయినప్పటికీ రష్యా నుంచి అధికంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశం భారతేనని వివరించింది.