బ్రహ్మోస్ క్షిపణులు కొనేందుకు సిధ్దమైన ఇండోనేసియా.. ఇండియాతో 350 మిలియన్ డాలర్ల ఒప్పందం

భారత్ న్యూస్ విశాఖపట్నం..బ్రహ్మోస్ క్షిపణులు కొనేందుకు సిధ్దమైన ఇండోనేసియా.. ఇండియాతో 350 మిలియన్ డాలర్ల ఒప్పందం

🇮🇩ఇండోనేసియా బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలుపై 2023లోనే ప్రచారం జరిగింది. అప్పట్లో అది ప్రాథమిక చర్చల దశలోనే ఉంది.

🇮🇩ఇప్పుడు ఈ చర్చలు ఒప్పందం దశకు చేరినట్లు ఇండోనేసియా రక్షణ శాఖ ప్రతినిధి రికో రికార్డో సిరైట్ సోమవారం వెల్లడించారు. తమ దేశం సైనిక, రక్షణ పరంగా ఆధునిక శక్తి సామర్ధ్యాలను పెంచుకునే లక్ష్యంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు అందులోనూ తెలిపారు. సముద్ర తీర దేశం కావడంతో తమకు రక్షణ పరంగా ఇది కీలకమన్నారు. అయితే, ఒప్పందం విలువను మాత్రం వెల్లడించలేదు. ఇంతకుముందు ఫిలిప్పైన్స్‌తో కూడా బ్రహ్మోస్ సంస్థ 2022లో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా ఇండోనేసియాతో ఒప్పందంపై బ్రహ్మోస్ సంస్థ కానీ, భారత రక్షణ శాఖ కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.