…భారత్ న్యూస్ హైదరాబాద్….మహిళా మావోయిస్టు..!
మహిళా అధికారి..!
ఇద్దరి దారులు వేరు..! లక్ష్యాలు వేరు..!
తాను జీవించే సమాజంలో అన్యాయానికి అణిచివేతకు గురవుతున్న వారిని చూసి చలించిపోయింది.. చిన్నవయసులోనే విప్లవ బాట పట్టింది..! అన్యాయంపై ఆయుధం ఎక్కుపెట్టింది..!
సమాజంలో జరిగే అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే పోలీస్ కావాలని భావించింది..అదే ఆకాంక్షతో… లక్ష్య సాధనలో విజయం దిశగా అడుగులు వేస్తోంది..పోలీస్ అధికారిగా సమాజానికి భరోసా ఇవ్వగలుగుతోంది..!
కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలేయాలని జనంతో పాటు నడుస్తూ ప్రజల హక్కుల పరిరక్షణకు పాటుపడాలని హితబోధ చేసింది..!
ఎందరో మహిళా మావోయిస్టుల ఆలోచనలో మార్పులు తీసుకురాగలిగింది..!
నిన్న మావోయిస్టుల లొంగుబాటు సందర్భంగా ఒక యువ మహిళా మావోయిస్టు తన ఆయుధాన్ని ముఖ్యమంత్రికి అప్పగిస్తూ.. అధికారి సుమతి వల్లే తనలో మార్పు వచ్చిందని సీఎంకు వివరించింది..!

మహిళా దినోత్సవం సందర్భంగా మీకు వందనం