తల్లిని కొట్టిన విషయంలో ఇంటివద్ద కేసు నమోదు

..భారత్ న్యూస్ హైదరాబాద్….వృద్దురాలైన తల్లిని కొట్టిన విషయంలో ఇంటివద్ద కేసు నమోదు

మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వృద్దురాలైన వస్కుల శాంత, భర్తపేరు: ఉప్పలయ్య, వయస్సు:72 సంవత్సరాల నివాసం :మడికొండ అనునామే రైల్వే లో పనిచేసి రిటైర్డ్ అయింది. ఆమెకు 5 గురు మగ సంతానం కలరు. నిన్న అనగా 06/03/2026 వ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఆమే మూడవ కుమారుడైన వస్కుల రామును భోజనం పెట్టమని అడుగగా అతడు కోపంతో ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. వెంటనే పక్కనే ఉన్న అతని భార్య సుమలత మరియు నాల్గవ కుమారుని భార్య కల్పన ముగ్గురు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. ఆమె కుమారుడు తలపైన రాయితో కొట్టి కింద పడవేయగా ఆమె తల పగిలింది. ఎడమ చేయి విరిగింది. ఈ విషయం తెలిసి ఆమె మరొక కుమారుడు శంకర్ ఆమెను MGM తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ఆమె నడవలేని స్థితిలో ఉండి 100 కు ఫోన్ చేయగా మడికొండ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ పుల్యాల కిషన్ గారు స్వయంగా వృద్దురాలి ఇంటికి ఆమె చెబుతుండగా దరఖాస్తూ రాసుకుని ఆమెను కొట్టినందుకుగాను భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ లతో పాటు వృద్ధుల సంరక్షణ చట్టం 2007 ప్రకారం కేసు నమోదు చేయడమైనది. ఈ సందర్బంగా మడికొండ ఇన్స్పెక్టర్ శ్రీ పుల్యాల కిషన్ గారు మాట్లాడుతూ గౌరవనీయులైన తెలంగాణ DGP శ్రీ శివదర్ రెడ్డి IPS గారు అద్భుతమైన ఆలోచనతో పోలీస్ స్టేషన్ కు రాలేని స్థితిలో ఉన్న వారికి పోలీస్ వారే స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి FIR చేయడం అనే విధానం మన దేశంలో మొదటిసారి తెలంగాణ పోలీస్ వారు తీసుకుని వచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. వృద్ధులను దూషించిన కొట్టిన వారికి ఏ విధమైన ఇబ్బంది కల్గించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హేచ్చరించారు. Fir నమోదు అనంతరం ఒక FIR కాపీ ని భాధిత మహిళ వస్కుల శాంత గారికి అందించారు.