భారత్ న్యూస్ తిరుపతి…టీడీపీ నేతలను పరామర్శించిన కనపర్తి శ్రీనివాసరావు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మంగళవారం అవనిగడ్డ,చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో పర్యటించి పలువురు పార్టీ నాయకులను, కార్యకర్తలను పరామర్శించారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ టీడీపీ అధ్యక్షుడు గొరిపర్తి సుబ్బారావు తల్లి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు వారి నివాసానికి వెళ్లి, మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్ను గాంధీ కుమారుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది, ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి నివాసానికి వెళ్లిన శ్రీనివాసరావు.. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, ధైర్యం చెప్పారు.ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ సర్పంచ్ మనవడు అనారోగ్యంతో మంచానికే పరిమితమైన విషయాన్ని తెలుసుకుని, ఆ చిన్నారిని పరామర్శించారు.ఈ పరామర్శలలో ఆయన వెంట దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,లక్ష్మీపురం ఎంపీటీసీ సభ్యుడు మాలెంపాటి శ్రీనివాసరావు తెలుగు యువత నాయకులు మోర్ల శివ,మేడికొండ విజయ్,పాటిబండ్ల నరేష్,సుంకర వీరయ్య చౌదరి,ప్రవీణ్,సుబ్రహ్మణ్యం,మణీ తదితరులు పాల్గొన్నారు
