వైరల్ వీడియో: ప్రజలారా తస్మాత్ జాగ్రత్త

భారత్ న్యూస్ గుంటూరు…వైరల్ వీడియో: ప్రజలారా తస్మాత్ జాగ్రత్త

కృత్రిమ మేధ (AI) సాయంతో ముఖాలను మార్చే సాంకేతికతపై ఓ యువకుడు చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

సదరు యువకుడు క్షణాల్లో తన ముఖాన్ని ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరోలుగా మార్చి ఆశ్చర్యపరిచాడు.

అయితే, ఇదే సాంకేతికతను వాడి మోసగాళ్లు మన కుటుంబసభ్యుల రూపాలను సృష్టించి ట్రాప్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి AI మాయాజాలం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు….