భారత్ న్యూస్ విశాఖపట్నం..చిప్ రంగం లో స్వయం సమృద్ధి
డిజిటల్ ప్రపంచంలో ‘ఆత్మనిర్భర్ భారత్’నినాదానికి బలం చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
ఎలక్ట్రానిక్స్ రంగానికి వెన్నెముక లాంటి సెమీకండక్టర్ల (చిప్స్) తయారీలో దేశాన్ని అగ్ర స్థానానికి చేర్చేందుకు ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 కు శ్రీకారం చుట్టింది .

2026-27 బడ్జెట్లో ఈ మిషన్ కోసం ప్రత్యేకంగా రూ.1,000 కోట్లు కేటాయించింది. పరిశోధన, శిక్షణ, పరికరాల తయారీపై దృష్టి సారిస్తూ, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దేశీయ టెక్నాలజీని అభివద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని కేంద్రం ప్రకటించింది.