మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ అలియాస్ గోపన్న లొంగుబాటు?

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ అలియాస్ గోపన్న లొంగుబాటు?

ములుగు జిల్లా:నవంబర్‌ 14 మావోయిస్టు పార్టీకి సంబంధించి మరో భారీ లొంగుబాటు చోటు చేసుకుంది, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అలియాస్ గోపన్న, నేతృత్వంలో భారీగా క్యాడర్ లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది మావోయిస్టు పార్టీకి చెందిన మరో ఇద్దరు కీలక నేతలు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్టు తెలుస్తున్నది.

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు జిల్లా మోద్దుల గూడెం గ్రామానికి చెందిన డివిజన్‌ కమిటీ కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌,అలియాస్ గోపన్న,తోపాటు డివిజన్‌ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్‌ రమేశ్‌ లొంగి పోనున్నట్టు సమాచారం. వీరితో దాదా పు 90% అగ్రనాయకత్వం జనజీవన స్రవంతిలోకి వచ్చినట్టేనని భావిస్తున్నారు.