భారత్ న్యూస్ ఢిల్లీ…..మాస్క్‌లు వేసుకుని.. భారత్ నౌకను ఎలా స్వాధీనం చేసుకున్నారో చూడండి..
పర్షియన్ గల్ఫ్‌లో కీలక సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ నౌకాదళానికి చెందిన సైనికులు భారతదేశానికి వెళ్తున్న ఓ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ఇరాన్ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది.
ముసుగులు ధరించిన కమాండోలు ఆ నౌకలను వెంబడించి, వాటిని ఎలా స్వాధీనం చేసుకున్నారో చూపిస్తున్న ఒక వీడియోను ఇరాన్ విడుదల చేసింది.ఆ వీడియో చూడడానికి ఓ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.

ఈ ఘటనలో రెండు నౌకలను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి భారతదేశం లోని గుజరాత్ వైపు ప్రయాణిస్తున్న నౌక అని వార్తలు వస్తున్నాయి. ఆ నౌకలు నిబంధనలను ఉల్లంఘించాయని, నావిగేషన్ సిస్టమ్‌లను మార్చి ప్రయాణించేందుకు ప్రయత్నించాయని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు…