తెలంగాణలో తీవ్ర ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

భారత్ న్యూస్ వరంగల్ …తెలంగాణలో తీవ్ర ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

May 03, 2026,

తెలంగాణలో తీవ్ర ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం (మే 3) అన్ని జిల్లాల్లో 40 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్, భూపాలపల్లిలో 46 డిగ్రీలు నమోదవడంతో, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే, మే 5, 6 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.