పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ..

భారత్ న్యూస్ అమరావతి..పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ..

DRDO రూ.15వేల కోట్ల పెట్టుబడి

అమరావతి :

ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రానుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు DRDO సిద్ధమైంది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (AMCA)ల తయారీ కోసం రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందుకోసం ప్రభుత్వం 600 ఎకరాలను కేటాయించింది. 2029 నాటికి తొలి ప్రోటోటైప్ ను సిద్ధం చేసి, 2035 నాటికి పూర్తిస్థాయిలో యుద్ధ విమానాలను అందుబాటులోకి తీసుకురావాలని DRDO లక్ష్యంగా పెట్టుకుంది.