ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత మరింత పెంచేందుకు, గుర్తింపు లేని వైద్యులకు కళ్లెం వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్ న్యూస్ గుంటూరు…ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత మరింత పెంచేందుకు, గుర్తింపు లేని వైద్యులకు కళ్లెం వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

👉 సంప్రదాయ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యూనాని, నేచురోపతి వైద్యానికి ప్రాచుర్యం తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం-2022కు సవరణ చేసే బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు.

👉 త్వరలో కొత్త విధివిధానాలు రాబోతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విధివిధానాల రూపకల్పన కోసం మూడు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. టెక్నికల్, ఎక్సపర్ట్స్, స్టేక్ హోల్డర్స్ కమిటీలు వేశారు.

👉 ఒక్కో కమిటీలో ముగ్గురు అధికారులు, సీనియర్ వైద్యులు, నిపుణులు ఉంటారు.

👉 ఈ కమిటీలు ఆయుష్ వైద్య రంగ నిపుణులు, ప్రజల్ని భాగస్వామ్యం చేసి వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఈ నెలాఖరులోగా నివేదిక సమర్పించనున్నాయి.

👉 విధివిధానాల రూపకల్పన కోసం కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ అంశాలను కమిటీలు పరిశీలిస్తాయని ఆయుష్ విభాగం ఇన్ఛార్జి డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు.

👉 కొత్తగా వచ్చే నిబంధనల ప్రకారం క్లినిక్ లు, ఆసుపత్రులు ఆయుష్ శాఖ నుంచి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాల్సి ఉంటుంది. విద్యార్హతలు కలిగిన వారి ద్వారా మాత్రమే ఆయుష్ వైద్య సేవలు ప్రజలకు అందుతాయి.