రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు…

భారత్ న్యూస్ విశాఖపట్నం..రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు…

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. రేపు ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఎల్లుండి కాకినాడ, కోనసీమ, ఉ.గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. ఈదురుగాలులు వీచేటప్పుడు చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని, తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని సూచించింది…..