vainam, who is a savior who is a savior, married and threatened to kill,

రక్షకభటుడే భక్షకభటుడైన వైనం పెళ్లి చేసుకొని ఆస్తి బంగారం కొట్టేసి చంపేస్తాను బెదిరిస్తున్న కైకలూరు సిఐ వార్త వివరణ:- కృష్ణా జిల్లా కైకలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వై వి ఎల్ నాయుడు తనను వివాహం చేసుకున్నాడని అతనికి ముందే పెళ్లి అయిందని 5 సంవత్సరాల క్రితం మొదటి భార్య అతన్ని విడిచి వేరే పురుషుడుతో వెళ్లిపోయిందని పిల్లల్ని సైతం విడిచి వెళ్లిపోయిందని చెప్పి నమ్మించి తన 80 లక్షల రూపాయల నగదు 45 కాసుల బంగారం తీసుకొని కొంతకాలం తనను లైంగికంగా వాడుకొని వదిలేసి వెళ్లిపోయాడని దీనిపై ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పీ ప్రశాంతి సిఐ వై వి ఎల్ నాయుడును విఆర్ చేశారని తదనంతరం సిఐ వై వి ఎల్ నాయుడు అతని మనుషులైనా పల్లె పద్మా రెడ్డి సందీప్ రెడ్లు తనకు కాల్స్ చేసి త్వరలో తనను బ్రతకనివ్వమని చంపేస్తామని బెదిరిస్తున్నారని వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటూ ప్రజలను ముఖ్యంగా మహిళలను రక్షించవలసిన పోలీసులే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడటం పోలీస్ శాఖకు తీవ్ర అవమానమని ఇటువంటి వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని తన ప్రాణాలను కాపాడాలని సదరు బాధితురాలు విజయలక్ష్మి తన వాంగ్మూలంలో ప్రెస్ మరియు మీడియా ద్వారా తెలిపింది