Welfare lights in every house: Tuda Chairman Chevireddy Mohit Reddy

  • ప్రతి ఇంటా సంక్షేమ వెలుగులు: తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
  • దామల చెరువు పంచాయతీలో 2వ రోజు పాదయాత్రకు ప్రజల నీరాజనాలు పాకాల,( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం     సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన వృద్దులకు వరమని.. పించన్ తోనే మా జీవనం, మనుగడ సాగుతోందని దామలచెరువు పంచాయతీలో పలువురు వృద్దులు తమ మనోగతాన్ని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎదుట ఆవిష్కరించారు. వారు మోహిత్ రెడ్డి చేతిలో చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడారు.. మోహిత్ రెడ్డి కూడా వారి పట్ల అదే ఆధరణ కనబరిచారు. మేము ఇప్పటి వరకు బ్రతికి ఉన్నామంటే.. ప్రతి నెలా వచ్చే పించన్ కారణమని వృద్దులు సంతోషం వ్యక్తం చేశారు. వృద్దులందరూ వైఎస్ఆర్సీపీని తప్పక ఆదరిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పండుగల సమయాల్లో పంపుతున్న కానుకలు మా వంటి వృద్దులకు కొండంత ధైర్యం ఇస్తున్నాయని తెలిపారు.
  •   శనివారం పాకాల మండలం దామల చెరువు పంచాయతీ పరిధిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 2వ రోజు గడప గడపకు మహా పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. మసీదు వీది, సందు వీది, శ్రీహరిపురం, నల్లానివారి పల్లి, జనపవీది, బజార్ వీది,
  • రెడ్డి వారి వీది, ఊటు కాల్వ, మఖాన్ వీదిలలో చేపట్టిన మాహా పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. ప్రతి ఇంటా సంక్షేమ పథకాల బుక్ లెట్ ను అందజేశారు. సంక్షేమ లబ్ధిని, చేసిన అభివృద్ధిని వివరించారు. ప్రతి ఇంటా మోహిత్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. ప్రజలు తమకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని మోహిత్ రెడ్డి వద్ద హర్షం వ్యక్తం చేశారు. అంగన్ వాడే కేంద్రం సందర్శించి వారితో ముచ్చటించారు. కల్మషం లేని చిన్నారుల మాటలతో మోహిత్ రెడ్డి మురిసిపోయారు. ట్రాక్టర్ గ్యారేజ్ లో మెకానిజం చేసి ఆకట్టుకున్నారు.
  • సంక్షేమ వెలుగులు
  • సీఎం జగన్ పాలనలో ప్రతి ఇంటా సంక్షేమ వెలుగులు వెల్లివిరిస్తున్నాయని తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్క దామల చెరువు పంచాయతీ లో రూ. 52.61 కోట్ల సంక్షేమ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు. అంతే కాకుండా పరోక్షంగా రూ.1.77 కోట్లు విద్యా కానుక, జగనన్న తోడు వంటి పథకాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగిందని వివరించారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీ వారు చెప్పే మాయమాటలు నమ్మవద్దని సూచించారు. ప్రజల వద్దకే పాలన కొనసాగించేందుకు మరోసారి సీఎం వైఎస్ జగన్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వ పాలన.. ప్రస్తుత పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు.
  • ఈ కార్యక్రమంలో ఎంపీపీ, సర్పంచ్, పార్టీ నాయకులు, ఎంపిడిఓ, తహశీల్దార్ భాగ్యలక్ష్మీ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.