ttd Chairman, tirupati said that tirupati is moving forward

అభివృద్ధిలో తిరుపతి రాష్ట్రంలో ముందుంది – టీటీడి చైర్మెన్ భూమన

11 కోట్లతో రెండు నూతన రోడ్లు ప్రారంభం – మేయర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరం( భారత్ న్యూస్ )

*అభివృద్ది విషయంలో రాష్ట్రంలో తిరుపతి ముందుకు వెలుతున్నదని టీటీడి చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా నూతనంగా నిర్మించిన రెండు రహదారులను మంగళవారం టిటిడి చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ హరిత ఐఏఎస్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ పాల్గొని ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా తిరుపతి రాష్ట్రంలో చర్చనీయంగా ఉందని, రహదారుల అభివృద్ధితో ప్రజాభివృద్ధి జరుగుతున్నదని అందులో భాగంగా నేడు ప్రారంభించిన అనంతాళ్వార్ మార్గానికి వారి వంశస్తులైన రంగాచారి, వారి అన్నదమ్ముల అమృత హస్తాలతో ప్రారంభించడం తమ అదృష్టం అన్నారు. మరో మార్గం తిరుమల వెంకటేశ్వర స్వామికి మాన్యాలు, దానాలు ఇచ్చిన పల్లవుల మహారాణి పరాంతక దేవి పేరు మీదగా నామకరణం చేయడం జరిగిందన్నారు. మహిళలు కూడా ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే విధంగా రాణి పరాంతకదేవి, సామవాయి, ఆండాల్ గోదాదేవి పేర్లను నూతన రహదారులకు పెట్టడం జరిగిందని, అదేవిధంగా స్వామి వారికి సేవ చేసిన మహనీయులైనటువంటి తిరుమల నంబి, జగద్గురు రామానుజాచార్యులు, అనంతాళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖర ఆల్వార్ మహనీయుల పేర్లు మీదుగా రహదారులకు నామకరణం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని భూమన పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ 264 లక్షలతో అంకురా హాస్పిటల్ ప్రక్క నుండి సిపిఆర్ అపార్ట్మెంట్ వరకు నిర్మించిన రహదారికి అనంతాళ్వారు మార్గంగా, అదేవిధంగా రేణిగుంట హిరో హోండా షోరూమ్ నుండి పద్మావతి పురం జడ్పీ హైస్కూల్ వరకు 831 లక్షలతో నిర్మించిన రహదారికి రాణి పరాంతకదేవి మార్గముగా నామకరణం చేయడం జరిగిందని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి నగరపాలక సంస్థ నిరంతర కృషి చేస్తున్నదని, రాబోయే కాలంలో తిరుపతి అభివృద్ధికి కావలసినటువంటి పనులు చేపట్టెందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే ప్రారంభించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల వలన తిరుపతి నగరంలో చాలావరకు ట్రాఫిక్ తగ్గడమే కాకుండా సులువుగా ప్రయానించేలా ప్రజలకు సౌకర్యం సౌకర్యవంతంగా రహదారులు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు తమ్ముడు గణేష్, రామిశెట్టి వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు ఉమా అజయ్, నరసింహాచారి, శేఖర్ రెడ్డి, ఆధం రాధాకృష్ణ రెడ్డి, నరేంధ్రనాధ్, నారాయణ, తిరుపతి మునిరామి రెడ్డి, శ్రావణి, తిరుత్తణి శైలజ, దూది కుమారి, రేవతి, సంధ్య, పొన్నాల చంధ్ర, బోకం అనీల్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు వెంకట రెడ్డి, ఇమామ్ సాహేబ్, రుద్రరాజు శ్రీదేవి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎంఈ చంద్రశేఖర్, డీఈలు మహేష్, సంజీవ్ కుమార్, వైసిపి నాయకులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, అజయ్ కుమార్, వెంకటముని రెడ్డి, దేవదానం, గోఫినాధ్ రెడ్డి, మునిరామి రెడ్డి, తలారీ రాజేంధ్ర, దినేష్ రాయల్, జక్కా శరత్, శ్యామల, గీతా, కాంట్రాక్టర్లు రమేష్ నాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.