With the blessings of Lord Tirumala, many problems were solved in the district

భారత్ న్యూస్ విజయవాడ,

జాయింట్ కలెక్టర్ డికే బాలాజి కి ఆత్మీయ వీడ్కోలు

తిరుమల శ్రీ వారి ఆశీస్సులతో జిల్లాలో పలు సమస్యలకు పరిష్కారం కలిగింది

ప్రతి అధికారి తన సర్వీసులో గొప్ప పనులు చేసి బెంచ్ మార్క్ పొందాలి: జిల్లా కలెక్టర్

నెల్లూరు, కరస్పాండెంట్:

తిరుపతి కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత మొదటి జాయింట్ కలెక్టర్ గా డీకే బాలాజీ విధుల్లో చేరడం 20 నెలల కాలంలో ఎన్నో పరిష్కారాలు చూపించారని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు.
ఆదివారం స్థానిక కలెక్టరేట్లో గతంలో తిరుపతి జేసీగా విధులు నిర్వహించి ఆరోగ్యశ్రీ సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన డీకే బాలాజీ వారికి జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు సిబ్బంది వీడ్కోలు సభ ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ , డి ఆర్ ఓ పాల్గొని ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో గుర్తుండిపోయేది అధికారిగా విధులు నిర్వహించిన చోట గొప్పగా పని చేసి ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేసి ప్రజలకు , ప్రభుత్వ అధికారులకు సూచనలు ఇస్తూ అనుకున్న పనులను త్వరితగతిన పూర్తి చేయడం వంటివి చేపట్టడంలో డీకే బాలాజీ ముందు వరుసలో ఉన్నారని కొనియాడారు. తాను పని చేసిన 20 నెలల కాలంలోనే రీ సర్వే సాదా బైనమా, సివిల్ సప్లై, నేషనల్ హైవేస్ వంటి వాటిలో తన ప్రతిభను చూపించి పరిష్కరించారని అన్నారు. 30,  40 సంవత్సరాలు రెవెన్యూ శాఖలో పనిచేసినా రెవెన్యూ శాఖపై పూర్తి అవగాహన రావడం కష్ట సాధ్యమని అలాంటిది తిరుపతి నగరంలో దాదాపు 60, 70 సంవత్సరాల పైగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ 20 వేల ఇళ్లకు పైగా పరిష్కారం చూపించారని ఇది గొప్ప విషయం అన్నారు.
డికే బాలాజీ, సీఈఓ ఆరోగ్యశ్రీ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా భగవంతుని ఆశీస్సులతో అనేక సమస్యలకు పరిష్కారం చూపగలిగానని ప్రతి ఒక్కరికి వీడ్కోలు సభ అన్నది ఒక ఎమోషనల్ అని అన్నారు. తిరుపతి నగరంలో చాలా గృహాలు రిజిస్ట్రేషన్లు జరగటం లేదని ఫిర్యాదులు అందడంతో పెద్దలు జిల్లా కలెక్టర్ వారిని సంప్రదించానని ఆయన ఇచ్చిన సమాధానంతోనే పరిష్కారం దొరికిందని అన్నారు. జిల్లా కలెక్టర్ విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన సమయంలో లక్ష ఇళ్లకు పైగా హక్కులు కల్పించగలిగామని తెలిపారని వెతికితే పరిష్కారం దొరకపోదని అన్నారని ఆ స్ఫూర్తితోనే నేడు రెవెన్యూ సిబ్బంది సహకారంతో దిగ్విజయంగా పరిష్కారం చూపి పనిచేయగలిగానని వివరించారు. సాదా భైనామ భూముల పరిష్కారం, చుక్కల భూములపై దృష్టి పెట్టి పరిష్కరించామని ఇలా చేయడం వల్ల రీ సర్వేలో ఇబ్బందులు తగ్గాయని అన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి పనబాకం వద్ద, అలాగే రేణిగుంట, నాయుడుపేట రహదారుల్లో సమస్య పరిష్కారాలలో చూపగలిగామని ఇవన్నీ భగవంతుని ఆశీస్సులతో, ప్రోటోకాల్ విధులతో పాటు నిర్వహిస్తూ పూర్తి చేయగలిగామని అన్నారు. డి ఆర్ ఓ పెంచల కిషోర్ మాట్లాడుతూ జెసి గా పలు ప్రభుత్వ కార్యక్రమాలు, రెవెన్యూ, రీసర్వే తదితర ప్రాధాన్యత అంశాలను సమర్థవంతంగా అమలు చేసి పురోగతి సాధించుటలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాబోవు కాలంలో మరిన్ని పదోన్నతులతో మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. జిల్లా అధికారులు, ఆర్డీఓ లు, మండల అధికారులు జెసి గారి సేవలను కొనియాడుతూ వారిని స్ఫూర్తిగా అందరూ అలవర్చుకోవాలని తెలిపారు. ఈ ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో కలెక్టరేట్ రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.