united student unions to stop privatization of visakhapatnam steel

భారత్ న్యూస్,

విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయండి

ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్

కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభించాలి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలి

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి

,భారత్ న్యూస్,అనంతపురం జిల్లా:- కడప ఉక్కు పరిశ్రమ ప్రారంభించాలని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని స్థానిక రాప్తాడు మండలంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు ఈ సందర్భంగా ఎన్ఎస్ యుఐ జిల్లా నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగాలు కల్పించిన పాపాన పోలేదన్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తానని అనేక హామీలు ఇచ్చి ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా,, ఈ రాష్ట్రంలో లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉపాధి కల్పిస్తూ వాళ్ల కుటుంబాలు పోషణకు ఆసరాగా నిలుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండో కుమ్మక్కై విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని చూడడం చాలా దారుణమని మండిపడ్డారు. అయ్యా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని విద్యార్థి యువజన సంఘాలు అనేక దఫాలుగా పోరాటాలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు ఉందన్నారు అంతేకాకుండా ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలను కార్పొరేట్ వ్యక్తులకు తాకట్టుపెట్టే యువచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు.. మరోపక్క విభజన చట్టంలో హామీలు రాయలసీమలోని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రారంభిస్తామని ఇప్పటికే అనేకసార్లు శంకుస్థాపనలు చేశారే తప్ప ఆచరణలో ప్రారంభించి పూర్తి చేసింది లేదని తెలిపారు. రాయలసీమ జిల్లాలో డిగ్రీలు పీజీలు పూర్తిచేసుకుని ఉద్యోగ అవకాశాలు లేక చెన్నైకు బెంగళూరుకు కేరళకు వలసలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే రాయలసీమలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో మల్లికార్జున,మహేంద్ర, మనోజ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.