sri bagh pact should be implemented.:-cpi-ml new democracy


నందికొట్కూరు
భారత న్యూస్

శ్రీ బాగ్ ఒడంబడిక అమలు చేయాలి.:-CPI-ML న్యూ డెమోక్రసీ

శ్రీ బాగ్ స్ఫూర్తితో పోరాడుదాం.

వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయ అవసరాల కోసం రాయలసీమ హక్కులను పణంగా పెట్టిందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి పి.మజీద్ మియా,డివిజన్ నాయకులు పి.లాజరేసు,పి. వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం నాడు స్థానిక పార్టీ కార్యాలయం నుండి తహసిల్దారు కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగానికి ఏపీ విభజన చట్టానికి వ్యతిరేకంగా కృష్ణాజిల్లాల పూనం పంపిణీ పై చీకటి జీవోను తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం లేదని తన రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ హక్కులను పణంగా పెట్టిందని అన్నారు. ఈ జీవో సీమ సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఈ చీకటి జీవోను అడ్డుకోకపోతే వర్షాలు బాగా పడిన సంవత్సరాలలో కూడా కృష్ణా నదిలో నీరు ప్రవహిస్తున్నా, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నీరు పొందే హక్కులు కోల్పోతామని తెలియజేశారు శ్రీ బాగోప్పందాన్ని గౌరవిస్తున్నామని చెబుతూ జగన్ ప్రభుత్వం రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు సాగునీటి హక్కులు ప్రాజెక్టుల నిర్మాణాలపై ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు కృష్ణ నీటిని నిల్వ చేసుకోవడానికి ఉన్న అరకురా రిజర్వాయర్లు మరమ్మత్తులను కూడా చేపట్టలేదని విమర్శించారు. తక్షణమే శ్రీ బాగ్ ఒడంబడిక ను అమలు చేసి రాయలసీమ నికరజలాలకు 6.5% నీటిని వెంటనే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కర్నూల్ లో హైకోర్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఉడంబడికను అమలు చేయలేని పక్షంలో రాయలసీమ వ్యాప్తంగా ఉన్న రైతులను వ్యవసాయ కూలీలను విద్యార్థులను యువజనులను సమీకరించి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు పి.మర్రిస్వామి, చూరిబి, సురేషు,నాగార్జున. పార్టీ కార్యకర్తలు సువర్ణ, భాస్కర్, హిలక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.