If you want to protect yourself from the clutches of the new land rights law like Penubhutam brought by the YSP government, you should use the weapon

bharath News Vijayawada,,,

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెనుభూతం లాంటి నూతన భూహక్కు చట్టం కోరల నుంచి ప్రజలారా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఓటు అనే ఆయుధంతో వైసీపీ పాలకులకు బుద్ధి చెప్పాలి……

టిడిపి, జనసేన కూటమికి ఓటు వేసి మరల అభివృద్ధిని పరుగులు పెట్టించండి…. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర….

వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం జిల్లా కోర్టులో న్యాయవాదులు , న్యాయవాదుల గుమస్తాలు
గత మూడు నెలలుగాచేస్తున్న నిరసన దీక్షకు బుధవారం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంఘీభావం తెలియజేసి మీడియాతో మాట్లాడుతూ….

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా తీసుకువచ్చిన నూతన భూ హక్కు చట్టాన్ని తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకువచ్చిన చీకటి నూతన భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రతి బహిరంగ సభలోను చెబుతున్నారు అన్నారు.

దాదాపు మూడు నెలలుగా న్యాయవాదులు విధులు బహిష్కరించి, రాష్ట్రంలోని మేధావులైన న్యాయవాదులు రోడ్డెక్కి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూ హక్కు చట్టం రద్దు చేయాలని ఉద్యమం చేస్తుంటే పాలకులు పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు.

భూమి వివాదాల్లో ఏదైనా చిన్న డిస్ప్యూట్ వచ్చిన మనకు తెలియకుండానే మన ఆస్తులపై
ఈ నూతన భూ హక్కు చట్టం వల్ల ఇతరులు అధికారాలు సృష్టించుకుని దౌర్జన్యంగా వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన భూహక్కు చట్టం ద్వారా ఆస్తులను లాక్కోవడం జరుగుతుందని, గతంలో వివాదాలు వస్తే న్యాయస్థానమునకు వెళ్లి వివాదాలు పరిష్కరించుకునేవారుమని, నేడు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నూతన భూ హక్కు చట్టం వల్ల న్యాయస్థానాల పరిధిని తప్పించి ఆర్డీవో స్థాయి అధికారికి బదలాయించడం వల్ల అధికారంలో ఉండే వారి కనుసన్నల్లోనే అధికారులంతా పనిచేసే పని ఉంటుంది కాబట్టి పూర్తిగా న్యాయం అనేది దొరక్కుండా ఉండే పరిస్థితి ఉంటుంది అన్నారు.

ఈ నూతన భూ హక్కు చట్టం వల్ల పెద్ద ఎత్తున నగదు మారే అవకాశం కూడా ఉంటుంది అన్నారు. అధికారాన్ని ఉపయోగించుకుని ఈ నూతన భూహక్కు చట్టం వల్ల సామాన్యులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది అన్నారు. న్యాయవాదులు, న్యాయవాదుల గుమస్తాలు ప్రజలకు హాని కలిగించే ఈ నూతన భూ హక్కు చట్టంపై చేస్తున్న పోరాటానికి ప్రజలందరూ మద్దతు తెలియజేయాలని కొల్లు రవీంద్ర సూచించారు.

ఈ నూతన భూ హక్కు చట్టంపై ఇంత ఉద్యమం జరుగుతున్న ముఖ్యమంత్రి స్పందించరు, రెవెన్యూ శాఖ మంత్రికిచెబితే ఏమి జరగటం లేదు కదా అని వారు మాట్లాడతారు. ఈ చట్టంపై న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది అన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనాలోచితమైన నిర్ణయాలతో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టించే పరిస్థితులు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.

ఈరోజు చనిపోయిన వారికి ఇచ్చే డెత్ సర్టిఫికెట్ మీద ముఖ్యమంత్రి గారి ఫోటో ఏమిటి అని ప్రశ్నించారు.

ఈరోజు మనం కొనుక్కున్నటువంటి ఆస్తులు మీద ప్రభుత్వం ఇచ్చేహక్కు పత్రాలకు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏమిటో అర్థం కావడం లేదు అన్నారు. ఎన్నో ప్రభుత్వాలు చూసాను కానీ గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు లేవు అన్నారు.

ఈరోజు మనకు అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని, అలా ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోకపోతే మనందరం కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చి మన బిడ్డల భవిష్యత్తుకు పూర్తి అన్యాయం జరుగుతుంది అన్నారు.

ప్రశ్నించకపోతే రాబోయే కాలంలో సమాధులు మీద ఉన్న రాళ్లపై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటాడేమో అన్నారు.

ప్రజలకు హానిచేసి నూతన భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, రాష్ట్రంలోని న్యాయవాదులు, న్యాయవాదుల గుమస్తాలు చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతును తెలుగుదేశం పార్టీ తరఫున తెలుపుతున్నాము అన్నారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, తుంగల హరిబాబు, ప్రధాన కార్యదర్శి, కొట్టి రఘురాం, న్యాయవాదుల గుమస్తాల సంఘం ప్రధాన కార్యదర్శి, పి. వి. ఫణి కుమార్, న్యాయవాదులు, లంకే వెంకటేశ్వరరావు, కూనపు రెడ్డి శ్రీనివాస్, తాత రవి, టీ సత్యనారాయణ, జీవీఎల్ నరసింహారావు, పుప్పాల ప్రసాద్, మాదివాడ వెంకట నరసింహారావు, అజ్మతున్నీసా బేగం, లావణ్య, రమాదేవి, సర్వ లలిత కుమారి, ఎం సురేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.