Special camps on voter list on Saturday and Sunday – Voter

శని,ఆది వారాల్లో ఓటర్ జాబితాపై ప్రత్యేక శిబిరాలు – ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్

తిరుపతి నగరం( భారత్ న్యూస్ )
తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గపు పరిధిలో కొత్త ఓటర్ల నమోదుకు, సవరణలకు సంబందించి డిసెంబర్ 2,3వ తేదిలందు ప్రత్యేక శిబిరాలను ఆయా పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ శుక్రవారం ఓక ప్రకటనలో తెలిపారు. 167 తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గపు పరిధిలోని 267 పోలింగ్ కేంద్రములందు బూత్ లెవెల్ అధికారులు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రములందు ముసాయిదా ఓటర్ల జాబితాలతో వుంటారని, ఓటర్లలు తమ పేర్లను ఓటర్ల జాబితాలో సరిచూసుకో వచ్చునని, ఓకవేళ తమ పేరు ఓటర్ల జాబితాలో లేనిచో ఫారం 6తో కొత్తగా నమోధు చేసుకొనవచ్చునని, ఏవైనా సవరణలు వున్నచో ఫారం 8 దాఖలు చేయవచ్చునని, ఎవరైనా ఓటర్ ఇటీవల చనిపోయి వున్నచో, సంబంధిత కుటుంబ సభ్యులు మరణ ధ్రువపత్రములు జతపరచి ఫారం 7 ద్వారా చనిపోయిన ఓటర్ పేరు ఓటర్ల జాబితా నుండి తొలగించుటకు బూత్ లెవెల్ అధికారికి దరఖాస్తు స్వయముగా అందజేయవచ్చునని కమీషనర్ హరిత ఐఏఎస్ తెలియజేసారు.