కరపత్రాలు, పోస్టర్లపై లెక్కలు చూపాల్సిందే : రిటర్నింగ్ ఆఫిసర్ అదితి సింగ్ ఐఏఎస్

కరపత్రాలు, పోస్టర్లపై లెక్కలు చూపాల్సిందే : రిటర్నింగ్ ఆఫిసర్ అదితి సింగ్ ఐఏఎస్

తిరుపతి( భారత్ న్యూస్ )తిరుపతి నగరం
ఎన్నికలకు సంబందించి ముద్రించే కరపత్రాలు, పోస్టర్లపై లెక్కలు పక్కగా చూపాల్సిందేనని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులకు తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫిసర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం తిరుపతి నగరంలోని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో రిటర్నింగ్ ఆఫిసర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదితి సింగ్ ఐఏఎస్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాలకు సంబందించిన ఎలాంటి విషయాన్ని అయిన ముద్రించేటప్పుడు ఎవరి కోసం, ఎన్ని పేపర్లు ముద్రిస్తున్నాము అనే వివరాలను ఖచ్చితంగ నమోదు చేయాలని, నమోదు చేసిన వివరాలను తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వారికి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫిసర్ వారి కార్యాలయానికి మరో కాఫిని తప్పని సరిగా అందించాలన్నారు. రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్లు ముద్రించే కరపత్రాలు, పోస్టర్లలోనే ముద్రించే సంఖ్య వివరాలు లేకపోతే చట్టపర్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫిసర్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు. ఈ సమావేశంలో తిరుపతి నగరంలోని ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, స్మార్ట్ సిటీ జి.ఎం చంద్రమౌళి, డిప్యూటీ తాసీల్ధార్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.