md haritha ias explained the works of tirupati

తిరుపతి స్మార్ట్ సిటీ పనులను డైరెక్టర్లకు వివరించిన ఎండి హరిత ఐఏఎస్

తిరుపతి నగరం( భారత్ న్యూస్ )తిరుపతి స్మార్ట్ సిటీ పనుల వివరాలను మంగళవారం జరిగిన స్మార్ట్ సిటీ సమావేశంలో పాల్గొన్న తిరుపతి స్మార్ట్ సిటీ చైర్మెన్, తిరుపతి జిల్లా కలెక్టర్ కు అదేవిధంగా డైరెక్టర్లకు తిరుపతి స్మార్ట్ సిటీ సిఈఓ అండ్ ఎం.డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ వివరించారు. తిరుపతి స్మార్ట్ సిటీ మిషన్ ఆధ్వర్యంలో మంజూరు చేయబడిన పనులలో ఇంకనూ కొనసాగుతున్న 25 పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని వర్చువల్ విధానంలో పాల్గొన్న కలెక్టర్ వెంకటరమణ రెడ్డి తెలియజేసారు. అదేవిధంగా స్మార్ట్ సిటీ మిషన్ నిధుల విడుదల కొరకు ప్రభుత్వానికి లేఖ వ్రాయ వలయునని కలెక్టర్ సూచించారు‌. జూన్ 2024 నాటికి మంజూరు అయిన అన్ని పనులు పూర్తి అగునట్లు ఇంజనీరింగ్ అధికారులతోనూ, కాంట్రాక్టింగ్ ఏజెన్సీలతో ప్రతి వారము సమీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని స్మార్ట్ సిటీ ఎండి హరిత వివరించారు. ఈ సమావేశంలో తిరుపతి స్మార్ట్ సిటీ సిఈఓ అండ్ ఎండి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, స్మార్ట్ సిటీ డైరెక్టర్స్ అయిన టీటీడీ జేయిఓ సదా భార్గవి, తిరుపతి జిల్లా ఎస్ఫి పరమేశ్వర రెడ్డి, తుడా వైస్ చైర్మెన్ హరికృష్ణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్మార్ట్ సిటీ మిషన్ అండర్ సెక్రటరీ విజయకుమార్, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ డాక్టర్ రామచంధ్రా రెడ్డి, డాక్టర్ రమాశ్రీ, మునిసిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ వి.ఆర్.చంద్రమౌళి, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.