library weeks from 14th. secretary of the district

14వ తేదీ నుండి గ్రంథాలయ వారోత్సవాలు. జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజు భారత్ న్యూస్ , శ్రీకాకుళం,నవంబర్ 10 జిల్లాలోని శాఖా గ్రంథాలయాల్లో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లాలో గల శాఖా గ్రంధాలయాల్లో 56 జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బి. కుమార్ రాజు పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాల నిర్వహణకు వీలుగా శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయములో వారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ ఈ వారం రోజులపాటు వినూత్న కార్యక్రమాలతో గ్రంథాలయాల ఆవశ్యకతను ప్రజలకు వివరించేలా తెలియజేయాలని కోరారు. గ్రంథాలయాలకు పిల్లలు ఆకర్షితులయ్యేటట్లుగా కార్యక్రమాలు చేయాలని సూచించారు. గ్రంథాలయాధికారులకు గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ వి.వి.జి.ఎస్ శంకరరావు శ్రీకాకుళం జిల్లా శాఖా గ్రంథాలయాధికారులు , గ్రామీణ గ్రంథాలయ పాలకులు పాల్గొన్నారు.