Efforts to build a Kshatriya building in Tirupati

తిరుపతిలో క్షత్రియ భవన నిర్మాణానికి కృషి

తిరుపతి నగరం( భారత్ న్యూస్ )
తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి నగర పరిధిలో క్షత్రియ భవన నిర్మాణానికి కృషి చేయనున్నట్లు రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు శివరామరాజు, అధ్యక్షులు బలరామరాజు, క్షత్రియ సోదరులు సత్యనారాయణ రాజు, సుదర్శన రాజు, కేఎల్ వర్మ తెలిపారు. తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ త్వరలో తిరుపతి నగరంలో అన్ని వసతులతో కూడిన క్షత్రియ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టి, వచ్చే మూడు నెలల్లో భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోత్తంగా నిర్వహించి రాష్ట్రంలోని అన్ని క్షత్రియ సంఘం నాయకులను ఆహ్వానించనున్నట్లు వారు తెలిపారు. బిల్డింగ్ నిర్మాణాన్ని పవర్ ప్రెసెంటేషన్ ద్వారా ప్రభాకర్ రాజు వివరించారు. బిల్డింగ్ కమిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కార్యదర్శి నారాయణ బాబు రాజు, డాక్టర్లు రవిరాజు, శ్రీధర్ రాజు, బాలరాజు, వీరేంద్ర వర్మ, మోహన్ రాజు, శ్రీధర్ వర్మ తదితరులు ప్రసంగిస్తూ ఐక్యమత్యంతో భవన నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. సోషల్ టెక్ రీసెర్చ్ ఫౌండేషన్ రీజనల్ కోఆర్డినేటర్ సుకుమార్ రాజు మాట్లాడుతూ ఎస్.టి.ఆర్.ఎఫ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. తదుపరి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, డాక్టర్ బాలరాజులను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.