Not only ministers, MLAs and MPs. Finally, people like PK are also running away from YCP

భారత్ న్యూస్ విజయవాడ,

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ సీట్లే

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు. చివరకు పీకేలాంటి వారు కూడా వైసీపీ నుంచి చాపచుట్టేస్తున్నారు

నెల్లూరు: తోటపల్లిగూడూరు మండలం తోటపల్లి పంచాయితీ డక్కిలివారిపాలెం, కామక్షినగర్, గ్రామాలలో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ కేద్రమంత్రి పనబాక లక్ష్మి పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది అని, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. విశాఖలో లక్షలాది మంది ప్రజానీకంతో సాగిన యువగళం, నవశకం సభ రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపుగా మారింది అని ఆయన అన్నారు. లోకేష్ బాబులో నాయకత్వ లక్షణాలు పెరిగాయనేందుకు నవశకం సభలో ఆయన చేసిన అద్భుత ప్రసంగమే నిదర్శనం అని, నిన్నటి వరకు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే చాపచుట్టేస్తున్నారనుకున్నాం. ఇప్పుడు పీకేలాంటి వారు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేసే పరిస్థితి వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగున్నరేళ్లుగా నియంతృత్వ పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో అనుభవించక తప్పదు అని అన్నారు. జన్మనిచ్చిన తల్లి నుంచి సామాన్య మానవుడి వరకు రాష్ట్రంలో ఎవరినీ ప్రశాంతంగా బతకనీయడం లేదు అని, డబ్బుపై ఉన్న యావతో నాసిరకమైన మద్యం విక్రయిస్తూ కొన్ని లక్షల మంది అనారోగ్యానికి, చావులకు జగన్మోహన్ రెడ్డి కారకుడయ్యాడు అని ఆయన పేర్కన్నారు. టీడీపీకి గత ఎన్నికల్లో 23 సీట్లయినా వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఆ 23 కూడా దక్కే పరిస్థితి లేదు. సింగిల్ డిజిట్ కు పడిపోవడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పనబాక లక్ష్మీ, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోడూరు శ్రీనివాసులు రెడ్డి, చెంచలబాబు యాదవ్,గ్రామ నాయకులు రామ్మోహన్ నాయుడు, కొనతం రఘు బాబు,పర్వత చిన్నయ్య, మీడురు రవి, బందెల రాజేష్,ఈదురు శివాయ, తోటపల్లి సుబ్బయ్య,
పూనమల్లి రామారావు, ఇంగిలాల ప్రసాద్, ఇంగిలాల రామమూర్తి, ఇంగిలాల శివయ్య, చైతన్య, నిర్మలమ్మ, జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, కోసురు నారాయణ, మండల,గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు