అధ్యాపకుడు…పాత్రికేయుడు…న్యాయవాది నుంచి అసెంబ్లీ వైపు అడుగులు

భారత్ న్యూస్,విజయవాడ:-

అధ్యాపకుడు…పాత్రికేయుడు…న్యాయవాది నుంచి అసెంబ్లీ వైపు అడుగులు

★ సంక్షేమం..అభివృద్ధి..ప్రజాస్వామ్యం పరిరక్షణే ధ్యేయంగా జొన్నలగడ్డ విజయ్ కుమార్ పయనం

యువకుడు…స్థానికుడు..విద్యా వంతుడే ప్రచార అస్త్రం.

★ ప్రచారంలోదూసుకుపోతున్న జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నలగడ్డ విజయ్ కుమార్.

కళాశాల అధ్యాపకుడు.. పాత్రికేయుడు.. న్యాయవాది నుంచి ఇప్పుడు రాజకీయ నాయకుడుగా అంచెలంచెలుగా ఎదిగి అసెంబ్లీ వైపు అడుగులు వేస్తున్నాడు స్థానిక యువ న్యాయవాది. కేవలం రెండు దశాబ్దాల కాలంలో అధ్యాపకుడు నుంచి అసెంబ్లీ వైపు అడుగులు వేసేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నాడు జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, యువ న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్. సంక్షేమం…అభివృద్ధి… ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా పయనిస్తూ వై నాట్ సత్తెనపల్లి అంటున్నాడు..

ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్పూర్తితో . పట్టుదలతో MA.LLB పూర్తి చేశాడు.★★ సత్తెనపల్లి పట్టణంలోని రాజులకాలనికి చెందిన జొన్నలగడ్డ విజయ్ కుమార్ పదో తరగతి వరకు శరభయ్య హై స్కూల్ లో చదివారు. డిగ్రీ నరసరావుపేట, ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు లో 2002 సంవత్సరంలో ఎంఏ ఎకనామిక్స్ (అర్థశాస్త్రం) పూర్తి చేశారు. అనంతరం సత్తెనపల్లి లో CSGLM జూనియర్ కలశాల్లో అధ్యాపకుడి గా చేరి ఇంటర్ విద్యార్థులకు మూడేళ్లు , ప్రగతి డిగ్రీ కలశాల్లో డిగ్రీ విద్యార్థులకు రెండేళ్లు పాఠాలు చెప్పారు. ఈ నేపధ్యంలో ప్రముఖ పేపర్, ఛానల్ లో (ఈనాడు, ఈటీవీ) పాత్రికేయులు గా అవకాశం రావటంతో సుమారు పన్నెండు సంవత్సరాలు పనిచేశారు. ఒకపక్క పాత్రికేయులు గా కొనసాగుతూనే 2015 ఎల్ ఎల్ బి డిగ్రీ పూర్తి చేసి సత్తెనపల్లి కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు…

★★ జడ శ్రావణ్ కుమార్ పిలుపుతో రాజకీయాల్లోకి*

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా బహుజనులు నేటికీ సమాజానికి దూరంగానే దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. బహుజనులకు సామాజిక, ఆర్ధిక, రాజకీయ సమానత్వం తీసుకొని రావటానికి న్యాయమూర్తి ఉద్యోగం ఇంకా 20 సంవత్సరాలు ఉన్నప్పటికీ జడ శ్రావణ్ కుమార్ రాజీనామా చేసి జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో యువత రాజకీయాల్లోకి రావాలి, మీలాంటి అభ్యుదయ భావాలు కలిగిన వారు రాజకీయాలకు రావాలని శ్రావణ్ కుమార్ పిలుపుతో జొన్నలగడ్డ రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత నియోజవర్గ కన్వీనర్ గా ఆ తర్వాత అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి గా ప్రకటించి పార్టీ బలోపేతానికి పాటుపడుతున్న తీరుతో పార్టీ జిల్లా అధ్యక్షుడుగా నియమించారు.

★ బాధితుల తరుపున పోరాటాలు

వైసీపీ..,తెదేపా, జనసేన., భారతీయ జనతా పార్టీ తదితర పార్టీల అభ్యర్థుల కంటే ముందుగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) అధినేత జడ శ్రావణ్ కుమార్ జొన్నలగడ్డ విజయ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఏడాదిన్నార క్రితమే ప్రకటించారు. దింతో అప్పటి నుంచే నియోజకవర్గంలో ఆయన ప్రజా క్షేత్రంలో తిరుగుతూ వారితో మమేకమైయ్యారు.సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో సుమారు 40 సంవత్సరాల నుంచి దళిత యువ రైతులు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో దళిత యువ రైతుల తరపున పోరాటాలు చేసి ఆ భూమి వారికి ఉండేలా కృషి చేశారు. అదేగ్రామంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఆదాయం రావట్లేదంటూ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేస్తున్నడంతో కాలనీ వాసుల కు అండగా నిలబడి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు వచ్చి ఆ ప్రయత్నాన్ని విరవింపజేశారు. సత్తెనపల్లి పట్టణం మూడో వార్డు మాస్టీన్ పేటలో అపరిస్కృతంగా నెలకొన్న సమస్యలపై పోరాటం చేస్తున్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లారు.దసరా., బతుకమ్మ దీపావళి, వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, ముక్కోటి ఏకాదశి రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు..,క్రిస్మస్ పండుగకు పేదలకు శాంత క్లాజ్ వేషధారణలో బహుమతులు అందజేశారు. క్రైస్తవుల శ్రమల దినాల్లో చర్చిలో ప్రేమ విందు తదితర కార్యక్రమాలు నిర్వహించారు… అదేవిధంగా చర్మకారుల సమస్యలు, వారి న్యాయమైన డిమాండ్స్ తెలుసుకునేందుకు వారి చెంతకు వెళ్లి పాదచారుల చెప్పులు కుట్టటం. చిన్నతరహా పరిశ్రమ నిర్వహకులు ఎదుర్కొంటున్నా సమస్యలపై కొలిమిలో మలాట్ కొట్టటం, వెల్డింగ్ షాపులో వెల్డింగ్ పనులు చేశారు. వీధి వ్యాపారులు కొబ్బరి బొండాలు, చెరుకు రసం అల్పాహార, టీ దుకాణాల నిర్వాహక…