జిల్లా కలెక్టర్ గారిని కలిసిన ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేషన్( కే వి జి వి ఎం) సంస్థ &అరుణోదయ్ ఆంధ్రప్రదేశ్

జిల్లా కలెక్టర్ గారిని కలిసిన ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేషన్( కే వి జి వి ఎం) సంస్థ &అరుణోదయ్ ఆంధ్రప్రదేశ్ కో-ఆర్డినేటర్ అరుణ్ కుమార్

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు శ్రీ డా.మ నా జీర్ జిలాని సమూన్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి (ఫోస్టాక్ )ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని మన జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించడానికి తమ వంతు ప్రోత్సాహాన్ని, సహాయ సహకారాలన్నీ ప్రభుత్వ పరంగా అందించాలని కోరారు .ఫుట్ పాత్ పై ఆహార వస్తువులు తయారుచేసి వ్యాపారం చేస్తున్న వారు మొదలుకొని స్టార్ హోటల్స్ వరకు అన్ని ఆహార వ్యాపారం చేసుకోన ప్రతి ఒక్క వ్యాపారస్తులు తయారీదారులు, శిక్షణ పొందుకొని ఆహారాన్ని ,పరిశుభ్రముగా ఎటువంటి కల్తి లేకుండా నాణ్యమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటటువంటి వారికి అందించేటట్టుగా సమాజాన్ని సామాన్యులను చైతన్యవంతులు చేయడానికి అరుణోదయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ మా ఎగ్జిక్యూటివ్ ద్వారా ప్రతి ఒక్క వ్యాపారికి అవగాహన కల్పించి శిక్షణ కొరకు సిద్ధపరచడానికి ప్రతి మండలం ప్రతి నియోజకవర్గం నుండి ప్రతినిధులను ఎంపిక చేసినమని తెలియజేశారు సందర్భంగా బ్రోచర్ని కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం గౌరవంగా వారిని సత్కరించి, నూతనంగా శ్రీకాకుళం జిల్లా కి వచ్చిన సందర్భంగా వారిని సత్కరించారు ఈ కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు కేసారం అప్పలరాజు గారు ఎగ్జిక్యూటివ్స్ గౌతమ్ ,పవన్,సాయి, ధనలక్ష్మి,నీరాజ మొదలగు వారు పాల్గొన్నారు