Women as Humans Day December 4 Gannavaram ZPTC Member Eliza Beth Rani of Annavara

భారత్ న్యూస్ విజయవాడ,

మహిళలను మనుషులుగా గుర్తించిన రోజు డిసెంబర్ 4 గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి

భర్త చనిపోతే భార్యని కూడా భర్త శవంతోపాటు చితిలో వేసి హత్య చేసే సంప్రదాయం 1889 డిసెంబర్ 4వ తేదీన దీనిని రద్దు చేశారు.ఆ నాడు మను ధర్మ శాస్త్రం అమలులో ఉండేది మను ధర్మ శాస్త్రంలో మహిళలను మనుషులుగా కూడా చూడ లేదు.ఇంటికి పరిమితం చేశారు.ఒకరకంగా చెప్పాలంటే భానిస కన్నా హీనంగా చుచేవారు
భర్త చనిపోతే భార్యని భర్త తో పాటు ఒక మహాజాతరలా జరిగేది. మేళతాలాలతో ఊరేగింపుగా ఊరు ఊరంతా తరలి పోయేవారు. చనిపోయిన భర్తకు చితి పేర్చి చితిపైన పెద్ద మంచె వేసి దానిపై స్త్రీని కూర్చోబెట్టి, చితిపై తన భర్త శవానికి నిప్పు అంటించగానే మంచె యొక్క నాలుగు కర్రలను నలుగురు తొలిగించేవారు.అలా మంచెపైన కూర్చున్న స్త్రీ, కాలుతున్న భర్త చితిపై పడిపోయేది. తను బయటకు రాకుండా పెద్ద కర్రలతో గట్టిగా అదిమి పట్టేవారు. ఆమె అరుపులు వినకుండా పెద్ద శబ్ధాలతో మేళతాలాలు వాయించేవారు.
అలా ఒక్క బెంగాల్ లోనే లక్షానలభై వేలమంది స్త్రీలను సతీసహగమనం చేశారు. దేశం మొత్తం లక్షల మంది స్త్రీలు అగ్నికి ఆహుతి అయ్యారు. ఇది స్త్రీల జీవితాలను ధ్వంసం చేసిన ఘోరకలి.చరిత్ర తెలుసుకుంటే ప్రతి మహిళ వల్లు గగ్గురపడతాయి అటువంటి పరిస్థితులనుండి అనేక మంది నాయుకులు రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చాంద్ విద్య సాగర్,జ్యోతిరావు పూలే కందుకూరి వీరేశలింగం భండారు అచ్చమాంబ రాజ్యలక్ష్మి మోతురు ఉదయం, మల్లు స్వరాజ్యం గారి లాంటి వారు ఆందోళన చేసిన పలితంగా నేడు మనం అన్ని రంగాలలో పురుషులతో పాటు సమానంగా ఏడగ గలుగు తున్నం అని అన్నారు.