the Chief Minister presented the best social service award to Arun Kumar. A church pastor

భారత్ న్యూస్ విజయవాడ,అరుణ్ కుమార్ కు సోషల్ సర్వీస్ ఉత్తమ అవార్డు అందజేసిన ముఖ్యమంత్రి. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణానికి చెందినటువంటి చర్చి పాస్టర్ మరియు సోషల్ సర్వీస్ అరుణోదయ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులైనటువంటి శ్రీ గరికి అరుణ్ కుమార్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ గ్రౌండ్స్ లో పదివేలకు మంది పైన క్రైస్తవ మత పెద్దలు మరియు విశ్వాసులు ప్రజానీకం మధ్య అవార్డ్స్ ప్రధానం చేశారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర నుండి గత 25 సంవత్సరాలుగా ఎనలేనటువంటి సామాజిక సాంఘిక ఆధ్యాత్మికమైన కార్యక్రమాల ద్వారా ప్రజలలో మంచి గుర్తింపు పొందినటువంటి అరుణ్ కుమార్ ని శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు రాష్ట్ర రెవెన్యూ మంత్రివర్యులు నామినేట్ చేశారు ఈ విధంగా వారిని అనేక అన్ని అర్హతలు ఉన్నటువంటి అరుణ్ కుమార్ ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క సంవత్సరం 2023 ఉత్తమ సోషల్ సర్వీస్ అవార్డుని మరియు నగదు సత్కారాల్ని అందించారు గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఈ సందర్భంగా అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ నిస్వార్ధంగా ఎటువంటి విదేశీ విరాళాలు లేకుండా స్థానిక ప్రజలు దాతలు ఇచ్చిన విరాళాలతో ఎన్నో ఉపాధి కార్యక్రమాలను మహిళా సాధికారత మెడికల్ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంట్ చిల్డ్రన్ డెవలప్మెంట్ యూత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ నిరుపేదలైన నీ సహాయకులైనటువంటి వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన నందుకు ఇప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అని ఈ సందర్భంగా నన్ను గుర్తించినటువంటి స్థానిక నాయకులకు మరియు ముఖ్యమంత్రివర్యులకు నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానని మరిన్ని కార్యక్రమాలతో ఇంకా ప్రజా సేవ చేయాలని ఆశిస్తున్నానని తెలియజేశారు