on the auspicious occasion of the month of Kartik,

కోటి దీపోత్సవం ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ భారత్ న్యూస్
లావేరు, నవంబర్ 27:

కార్తీకమాసం శుభ సందర్భంగా బెజ్జిపురం గ్రామంలో వచ్చే నెల తొమ్మిదో తేదీన శనివారం కోటి దీపోత్సవం, అయ్యప్ప స్వామి అంబళం పూజా మహోత్సవం నిర్వహణకు సంబంధించి ఆహ్వాన పత్రికను శ్రీ ఉమా రామలింగేశ్వర పంచాయతన దేవస్థానం వద్ద కమిటీ సభ్యులు , గ్రామ పెద్దలు సోమవారం ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఇజ్జాడ శ్రీనివాసరావు, పిన్నింటి మధుబాబు, దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆరవెల్లి సురేష్ కుమార్ శర్మ, ఇజ్జాడ అప్పారావు, వడ్డిపల్లి శ్రీనివాసరావు, ఇజ్జాడ సన్యాసి నాయుడు, దన్నాన శ్రీనివాసరావు, ఇజ్జాడ విశ్వనాథం, దన్నాన ప్రసాద్, పిన్నింటి నారాయణరావు, ఇప్పిలి లక్ష్మీ నాయుడు, కలిశెట్టి ధర్మారావు, కలిశెట్టి గణపతి, ఇజ్జాడ మల్లేశ్వరరావు, దన్నాన శ్రీను, ఇప్పిలి నాగేశ్వరరావు, కలిశెట్టి రాంబాబు జవ్వాది ప్రసాద్ , గ్రామ పెద్దలు పాల్గొన్నారు