:: అనంత నూతన క్యాలెండర్లు విడుదల చేసిన,కూడేరు సిఐ శివరాముడు

భారత్ న్యూస్ కూడేరు:: అనంత నూతన క్యాలెండర్లు విడుదల చేసిన,

కూడేరు సిఐ శివరాముడు,

కూడేరు ఫిబ్రవరి 23 (భారత్ న్యూస్) అనంత ప్రభ, అలాగే ఫోకస్ అనంత నూతన క్యాలెండర్లను కూడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ రాముడు, కూడేరు జర్నలిస్ట్ యూనియన్ సంఘం అధ్యక్షుడు ఎం ఎర్రి స్వామి, వైయస్సార్ పార్టీ మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రెటరీ తోపుదుర్తి రామాంజనేయులు, సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ రామదుర్గం క్రిష్టప్ప, ముద్దలాపురం సర్పంచ్ ధనుంజయ తదితరులు పాల్గొని నూతన క్యాలెండర్లను విడుదల, ఈ సందర్భంగా సిఐ శివరాముడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో రాజకీయ పార్టీలకతీతంగా పాత్రికేయ మిత్రులు మండల వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినచో తమకు సమాచారం తెలియజేయాలని తెలిపారు. మండలంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు ప్రజలను అందరిని కలిసి ఆ గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడంజరుగుతుందని సి శివ రాముడు విలేకరులకు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అనంత ప్రభ విలేకరి, ఆదినారాయణ, ఫోకస్ అనంత విలేఖరి జై ముత్యాలన్న, వైయస్సార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఫోటో రైట్ అప్.. నూతన క్యాలెండర్లను పంపిణీ చేస్తున్న దృశ్యం.