Today is the birthday of Jagan Mohan Reddy who transferred money in the account of the poor for financial ease

భారత్ న్యూస్ విజయవాడ,

ఆర్థిక వెసులుబాటు కొరకే పేదల అకౌంట్ లో నగదు బదిలీ చేసిన జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నేడు గ్రామ గ్రామాన దేవాలయాలలో పూజలు చేయాలనీ గన్నవరం జడ్పీటీసి అన్నవరపు ఎలిజా బెత్ రాణి.

గత నాలుగున్నార సంవత్సరాలనుండి పేదల ఆర్థిక వెసులు బాటు కొరకు రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి వారి అకౌంట్ లో నగదు బదిలీ చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేసిన గన్నవరం జడ్పీటీసి సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి.గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పేదలను ఆర్థిక భాదల నుండి ఆదుకున్నారు అని ఈ నెల 21వ తేదీన జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినం నాడు 4.35 లక్షల మంది విద్యార్ధులకు ట్యాబ్ లు అందించనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి 65.33 లక్షల మందికి పెరిగిన పెన్షన్ రూ 3 వేలు అందనుంది. జనవరి 10వ తేదీ నుంచి ఆసరా పథకం ద్వారా ఇప్పటికే 78.81 లక్షల మందికి 19,165 కోట్లు పంపిణీ చేసారు. తాజాగా చివరిదైన నాల్గవ విడత రూ 6,393 కోట్ల రూపాయాలను ఆసరా లబ్దిదారులకు అందించనున్నారు. అదే విధంగా 29వ తేదీ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్ది దారులకు 18,750 కోట్లు పంపిణీకి నిర్ణయించారు. దీని ద్వారా 30 రోజుల పాటు సంక్షేమ పండుగ నిర్వహించి దాదాపు కోటిన్నార మందికి లబ్ది కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని కోటిన్నార మందికి లబ్ది చేకూరాతాయి. ఈ పధకాలు కోన సాగాలంటే 2024 లో మరల ముఖ్యమంత్రి గా వైస్ జగన్ మోహన్ రెడ్డి గారిని గెలిపించు కోవాలని అందుకు ప్రతి పేద కుటుంబం సి యమ్ జగన్ మోహన్ గారి పుట్టినరోజు అన్ని గ్రామాలలో లబ్ధిదారులు అందరు రాజకీయలతో సంబంధం లేకుండా అన్ని మతాల కు చెందిన దేవాలయాలో పూజలు చేయాలనీ కేకు కటింగ్ చేయాలనీ జడ్పీటీసి విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు.