భారత్ న్యూస్ గుంటూరు…అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్
అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘ప్రజా దర్బార్’కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై నాయకులకు వినతి పత్రాలు సమర్పించారు. బాధితుల సమస్యలను సావధానంగా విన్న నాయకులు, వాటిని తక్షణమే పరిష్కరించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి,ఆంధ్రపదేశ్ నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ పైడిపాముల స్వప్న,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి రత్నగిరి,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి బసవేశ్వరరావు, పార్టీ నాయకులు మండలి రామమోహనరావు,పర్చూరి దుర్గాప్రసాద్,మేడికొండ విజయ్,కంచర్ల ఆనంద్,గుంటూరు వినయ్ బాబు,కొల్లూరి వాసు తదితరులు పాల్గొన్నారు
