భారత్ న్యూస్ విజయవాడ..కోనసీమ మార్కెట్ చరిత్రలో ఆల్టైమ్ రికార్డు
విజయవాడ :
కోనసీమ జిల్లా మార్కెట్లో పచ్చి కొబ్బరి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది.క్వింటా రూ.17,500కు చేరింది. గతేడాది రూ.9,500గా ఉంది. గత నెల చివరివారంలో రూ.16 వేల వరకు ధర పలకగా ప్రస్తుతం ఏకంగా రూ.17,500కు ఎగబాకింది. మార్కెట్ చరిత్రలోనే ఇది అరుదైన రికార్డుగా రైతులు, వ్యాపారులు అంటున్నారు. కాగా కేరళలోని అలెప్పీ, తమిళనాడు లోని పొల్లాచి ప్రాంతాల్లో కొబ్బరి ఉత్పత్తులు తగ్గడం ధర పెరగడానికి కారణమైంది.
