కృష్ణా జిల్లాకు హీట్ వేవ్ హెచ్చరికలు – మే 24 వరకు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్

కృష్ణా జిల్లాకు హీట్ వేవ్ హెచ్చరికలు – మే 24 వరకు అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్☀️

హీట్ వేవ్ అలర్ట్ : కృష్ణా జిల్లాకు కలెక్టర్ హెచ్చరికలు

భారత్ న్యూస్ రాజమండ్రి…మచిలీపట్నం, మే 20:-
కృష్ణా జిల్లాలో మే 20 నుంచి 24 వరకు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశముందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు.

APSDMA మరియు IMD ప్రత్యేక బులెటిన్ ఆధారంగా అన్ని శాఖల అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలోని అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

ముఖ్యంగా శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

ఎండలో ఎక్కువసేపు తిరగవద్దని,
తగినంత నీరు తాగాలి
ORS, మజ్జిగ, నిమ్మరసం, గంజి వంటి ద్రవాలు తీసుకోవాలి
శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి.

అవసరం లేకుండా బయట తిరగవద్దు. పలుచని, లేత రంగు పత్తి దుస్తులు ధరించాలి. టోపీ, గొడుగు వాడాలి.

అలాగే రైతులు మధ్యాహ్న వేళల్లో పనులు తగ్గించుకోవాలని, ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు.