పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్‌కు కాల్‌ చేస్తే చాలు!

భారత్ న్యూస్ విశాఖపట్నం..పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్‌కు కాల్‌ చేస్తే చాలు!

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉన్నప్పటికీ రూ.2,000 జమ కాకపోతే ముందుగా కారణాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసం 1800-180-1551 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి మీ వివరాలు అందిస్తే, చెల్లింపు ఎందుకు నిలిచిపోయిందో అధికారులు వివరిస్తారు. సాధారణంగా e-KYC పూర్తి కాకపోవడం, భూమి రికార్డుల ధృవీకరణ లేకపోవడం, బ్యాంక్ ఖాతా లేదా వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు ఉండటం వల్ల నిధులు ఆగిపోతాయి. అవసరమైతే సమీప CSCలో వివరాలు అప్‌డేట్ చేయించుకోవచ్చు. అలాగే CPGRAMS పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అర్హత ఉన్న రైతులు వివరాలు సరిచేసుకున్న తర్వాత బకాయి నిధులు ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంటుంది