భారత్ న్యూస్ ఖమ్మంఇసుక మాఫియా అక్రమాలకు బలైన నిండు ప్రాణం….
అంబులెన్స్‌కు సైతం దారి ఇవ్వకుండా రహదారిపై అడ్డంగా నిలిపిన లారీలు
భుజంపై రోగిని మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు మండలం సాంబాయిగూడెం నుండి రామానుజవరం వరకు రహదారిపై అడ్డంగా నిలిపిన ఇసుక లారీలు
అదే మార్గంలో మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామంలో పురుగుల మందు తాగిన వంశీ(35) అనే వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా, కనీసం అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని ఇసుక లారీలు

భుజంపై మోసుకుని వెళ్ళే సరికి ప్రాణాలు కోల్పోయిన వంశీ
అరగంట ముందు తీసుకొస్తే బతికేవాడని తెలిపిన వైద్యులు
ఇసుక లారీలు రోడ్డును బ్లాక్ చేయడంతోనే వంశీ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు…..