భారత్ న్యూస్ వరంగల్…మెగా లోక్ అదాలత్: 6,545 కేసులు పరిష్కారం, రూ. 73 లక్షలకు పైగా రికవరీ
పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతంగా ముగిసింది. ఈ అదాలత్ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లలో దర్యాప్తులో ఉన్న, కోర్టు విచారణలో ఉన్న మొత్తం 6,545 కాంపౌండబుల్ కేసులు పరిష్కరించబడ్డాయి. 83 సైబర్ నేరాల కేసులను పరిష్కరించి, బాధితులకు చేరాల్సిన రూ. 73,67,714 రికవరీ చేసి తిరిగి అందజేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) అంబర్ కిషోర్ ఝా తెలిపారు.
