భారత్ న్యూస్ వరంగల్.పంట కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: తుమ్మల….
తెలంగాణ : రాష్ట్రంలో పండిన పంటలను కేంద్రం కొనకుండా, కేవలం మద్దతు ధర (MSP) ప్రకటించి చేతులు దులుపుకొంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎంపీలు, మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లనుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసిందని, కేంద్రం ఒక్క గింజ కూడా కొనకపోతే చిన్న రాష్ట్రం ఈ భారం ఎలా మోస్తుందని ప్రశ్నించారు….
